రజినీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జైలర్ .నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ సెట్స్ నుంచి సునిల్ లుక్ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఈ లుక్ను సునిల్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్లో నేను.. ఇలాంటి అద్భుతమైన పాత్ర ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్, సన్ పిక్చర్స్, రజినీకాంత్కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ సునిల్ పాత్రేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మోహన్ లాల్ లుక్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.














