Namaste NRI

ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం … హోం మంత్రితో సహా 18మంది

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో హెలికాప్ట‌ర్ కూలింది. ఆ ఘ‌ట‌న‌లో ఆ దేశ హోంశాఖ మంత్రి డెనిస్ మోన‌స్ట్రిస్కీతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 22 మంది గాయ‌ప‌డ్డారు. దాంట్లో ప‌ది మంది చిన్నారులు ఉన్నారు. గాయ‌ప‌డ్డ‌వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బ్రోవ‌రీ పట్ట‌ణంలో ఉన్న కేజీ స్కూల్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కీవ్‌కు 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆ ప‌ట్ట‌ణంలో ల‌క్షా ప‌ది వేల మంది జ‌నాభా ఉన్నారు. హోంశాఖ మంత్రి మోన‌స్ట్రిస్కీతో పాటు డిప్యూటీ మంత్రి ఎవ్‌జ‌నీ యెనిన్‌, ఆ శాఖ‌కు చెందిన ఇత‌ర ఉన్నతాధికారులు ఉన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో అరుపులు, కేక‌లు వినిపించాయి. ఏ కార‌ణం చేత ప్ర‌మాదం జ‌రిగిందో ఇంకా తెలియ‌రాలేదు.

Social Share Spread Message

Latest News