Namaste NRI

న్యూజిలాండ్ ప్రధాని అనూహ్య నిర్ణయం ..వచ్చేనెల మొదటి వారంలో

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్  అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.  వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు. లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో ఆమె న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

Social Share Spread Message

Latest News