టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఓ కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్నా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నాడు. అయితే ఫలితం ఎలా ఉన్నా నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం శౌర్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. పవన్ బసమ్శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఆదివారం నాగశౌర్య బర్త్డే సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. శౌర్య గణపతి నిమర్జణ వేడుకలో ఉన్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. పవన్ సీ.హెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.














