Namaste NRI

అగ్రరాజ్యంలో మరోసారి  కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్లో జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఇక్కడ మాంటెరీ పార్క్లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతండగా,  ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సమయంలో చాలా మంది బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తున్నది. కాల్పులకు కారణం మాత్రం తెలియరాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events