Namaste NRI

ఓటీటీలోకి వచ్చేసిన ధమాకా

రవితేజ  కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ధమాకా. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు త్రినాథ్రావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-మాటలు అందించాడు.  భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్  టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ వీక్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. రవితేజ కెరీర్లో తొలి వంద కోట్ల గ్రాస్ సినిమా ఇదే అవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ధమాకా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్థరాత్రి నుండి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events