Namaste NRI

జో బైడెన్ కు షాక్‌.. మరోసారి సోదాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెడకు రహస్య ఫైల్స్  చుట్టుకుంటున్నాయి. గతంలో పలు రహస్య ఫైల్స్ లభ్యమవగా  ఆయన ప్రైవేట్ హైస్లో చేపట్టిన మరో సెర్చ్లో ఇంకో 6 ఫైళ్లు దొరికాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 13 గంటలపాటు డెలావేర్లోని బైడెన్ ఇంట్లో అధికారులు సెర్చ్ చేశారు. ఈ ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. డెలావేర్లోని ఇంట్లో సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్గానీ, ఆయన భార్యగానీ ఇంట్లో లేరు. బైడెన్ ఇంట్లో దొరికిన పత్రాల్లో కొన్ని ఆయన సెనేటర్గా ఉన్న కాలంనాటివిగా గుర్తించారు. మరికొన్ని ఆయన గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనివిగా నిర్ధారించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన లీగల్ టీమ్లు, వైట్హౌస్ అధికారి ఒకరు ఉన్నట్లు  తెసింది.

 బైడెన్ లివింగ్ రూం మొదలుకొని గ్యారేజి వరకు మొత్తం ఇంటిని శోధించారు. ఈ సెర్చ్లో ఇంటెలిజెన్స్ ఫైల్స్తో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని నోట్స్ కూడా లభించినట్లు తెలుస్తున్నది.జో బైడెన్ స్వయంగా న్యాయ శాఖ అధికారులను పిలిచి ఇంటిని మరోసారి సోదా చేయించారని న్యాయవాది బాబ్ బోయర్ తెలిపారు. ఇంట్లో సెర్చ్ పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని బహిరంగపరచవద్దని న్యాయ శాఖ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.   2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానని బైడెన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రహస్య పత్రాల వ్యవహారం ఆయన మెడకు గుదిబండగామారే అవకాశం కనిపిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events