Namaste NRI

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన కొప్పల సాయి చరణ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.  ఈ ఘటన అమెరికాలోని చికాగోలో చోటు చేసుకుంది. సదరు విద్యార్థి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.  దీంతో వెంటనే అతన్ని హుటాహుటినా చికాగో యూనివర్సిటీలోని మెడికల్ సెంటర్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన గురించి అతడి స్నేహితులు చరణ్ తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు.  సాయిచరణ్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events