ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ ఫోటోతో రూపొందించిన కేక్ను ఎన్నారై టీడీపీ సభ్యులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం మెల్బోర్న్ సభ్యులు పాలుపంచుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో జూమ్ ద్వారా పెనమలూరు ఇంచార్జ్ బోడె ప్రసాద్, దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు, వై. వి. రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.














