Namaste NRI

ఎన్టీఆర్  ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ  క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని తెలిసిందే. ఎన్టీఆర్ 30 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేందుకు కొరటాల టీం ప్రిపరేషన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఎన్టీఆర్ 30 కోసం ఓ భారీ సెట్టును నిర్మించే పనిలో ఉన్నారట కొరటాల టీం. టాప్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నేతృత్వంలో సెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సెట్లో తారక్పై వచ్చే యాక్షన్ పార్టుతోపాటు కొంత టాకీ పార్టు పూర్తి చేయబోతున్నారని సమాచారం. సెట్టు ఉత్తమ క్వాలిటితో ఉండేలా బడ్జెట్ పెడుతున్నారట మేకర్స్.

ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుందని ముందుగానే ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్గా చీుR 30 తెరకెక్కనుంది. పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events