Skip to main content

Namaste NRI

ఇరు దేశాల మధ్య ఘర్షణలు.. జరిగే అవకాశం

భారత్, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హిమాలయ ప్రాంతంలోని లడఖ్ వద్ద భద్రతకు సంబంధించిన ఒక నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఈ ప్రాంతంలో సైనికపరమైన మౌలిక సదుపాయాలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పెంచుతుండటం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారితీయవచ్చని అంచనా వేసింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు సేకరించిన నిఘా సమాచారం, భారత్-చైనా మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఘర్షణలు, ఉద్రిక్తతల నమూనాను విశ్లేషిస్తే, 2013-14 నుంచి ప్రతి రెండు మూడేళ్లకు ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నది. ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక మౌలిక నిర్మాణాలు చేపట్టడంతోపాటు బలగాలను పెంచుకుని బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి్ణ అని అందులో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News