Skip to main content

Namaste NRI

నారా లోకేష్ పాదయాత్రకు ఎన్నారైల సంఘీభావం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా దుబాయిలో  తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో వంతుల వారీగా సభ్యులు దుబాయి నుండి వెళ్ళి పాల్గొనాలని నిర్ణయించినట్లుగా ఖాదర్ బాషా పెర్కోన్నారు.  యు.ఏ.ఇ తెలుగు దేశం శాఖ అధ్యక్షుడు యం. విశ్వేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగుదేశం జి.సి.సి. సభ్యుడు ఖాదర్ బాషా, పార్టీ నాయకులు మజ్జీ శ్రీనివాస్, యన్. శ్రీనివాస్, వీరవల్లి వినాయక్, కాల సత్య, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News