Skip to main content

Namaste NRI

ప్రేమదేశం ప్రీ రిలీజ్ ఈవెంట్

త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ప్రేమదేశం. స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీకాంత్ సిద్ధం రూపొందించారు. శిరీష సిద్ధం నిర్మాత.  మధుబాల కీలక పాత్రను పోషించారు.  తాజాగా హైదరాబాద్‌లో  చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దర్శకుడు శైలేష్ కొలను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ప్రేమదేశం. మధుబాల కీలక పాత్రను పోషించారు. స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీకాంత్ సిద్ధం రూపొందించారు.  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే చిత్రాలకు మంచి విజయాలు దక్కుతున్నాయి. మా నియోజకవర్గంలో సినిమా షూటింగ్ల కోసం ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తాం అన్నారు. నిర్మాత శిరీష్ సిద్ధం మాట్లాడుతూ మా చిత్రం నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన కంటెంట్కు మంచి స్పందన వస్తున్నది. మణిశర్మ సంగీతాన్ని అందించిన పాటలు హిట్ అయ్యాయి. యువతకు నచ్చేలా మా సినిమాను నిర్మించాం అన్నారు.  ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News