Skip to main content

Namaste NRI

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు.. చేతులు కలిపిన భారత్-అమెరికా

ప్రపంచ దేశాలకు సెమీకండెక్టర్ల షార్టేజీతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సెమీకండెక్టర్లు ఒక్క చైనాలోనే ఉత్పత్తయ్యావి. తమతో కయ్యం పెట్టుకున్న దేశాలకు సెమీకండెక్టర్లను ఎగుమతి చేయకుండా చైనా అడ్డుకుంటూ వస్తున్నది. దీంతో ఎన్నో రకాల పరికరాల తయారీ నిలిచిపోవడమే కాకుండా ఖరీదైనవి కూడా మారాయి. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్-అమెరికా దేశాలు చేతులు కలిపాయి. ఇరుదేశాల మధ్య అంతరిక్షం టెక్నాలజీ గురించి కూడా చర్చ జరిగింది. ఈ చర్చల్లో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా హాజరయ్యారు. చైనా టెక్నాలజీ సమస్యను ఎదుర్కోవడానికి ఐసెట్   ఒప్పందంపై భారత్-అమెరికా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుల్లివన్ల సమక్షంలో ఒప్పంద పత్రాలను ఇరుదేశాల ప్రతినిధులు మార్చుకున్నారు.

భారత్-అమెరికా దేశాల మధ్య ఱజజు ఒప్పందం జరుగడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా సెమీకండక్టర్లు, సైనిక పరికరాలు, కృత్రిమ మేధస్సుతో ఇరు దేశాలు చైనా టెక్నాలజీతో పోటీ పడగలవని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విశ్వాసం ప్రకటించారు.

Social Share Spread Message

Latest News