Skip to main content

Namaste NRI

భారత సంతతి బాలిక అద్భుత ఘనత .. ప్రపంచంలోనే

అమెరికాలో భారత సంతతికి చెందిన బాలిక నటాషా పెరియనాయగం (13) అద్భుత ఘనత సాధించింది. వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో  పెరియనాయగం నటషా  చోటుదక్కించుకుంది. ఈ జాబితాలో నటషా  చోటు సంపాదించడం వరుసగా రెండో ఏడాది. అమెరికాకు చెందిన జాన్ హప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ప్రతి ఏటా ఈ టాలెంట్ టెస్టును నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో 15 వేల మంది విద్యార్థులు రాసిన గ్రేడ్ లెవల్ పరీక్షల ఫలితాల ఆధారంగా జాన్ హప్కిన్ సెంటర్ ఈ జాబితాను రూపొందిందించి. పెరియనాయగం నటషా న్యూ జెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడిల్ స్కూల్‌లో  విద్యాభ్యాసం చేస్తున్నది. జాన్ హప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ గత ఏడాది నిర్వహించిన టాలెంట్ టెస్టులో కూడా నటషా గ్రేడ్ 5 స్టూడెంట్‌గా  నిలిచింది. సెంటర్ నిర్వహించిన అన్ని పరీక్షల్లో నటషా అద్భుతమైన ప్రతిభ కనబర్చిందని జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ  పేర్కొన్నది.  పెరియనాయగం తల్లిదండ్రులు చెన్నై నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

Social Share Spread Message

Latest News