ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన మాడల్ ఏ కారు రోడ్డుపైనా నడువగలదు, గాలిలో ఎగురగలదు. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 177 కిలోమీటర్ల వరకు గాలిలో ప్రయాణించొచ్చు. అదే రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనమైన ఈ కారు ధర రూ.2.46 కోట్లు.

















