Skip to main content

Namaste NRI

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తానా నాయకుల ఘనస్వాగతం

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు ఫిలడెల్ఫియా వచ్చిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తానా నాయకులు ఘనస్వాగతం పలికారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, జగదీష్‌ ప్రభల తదితరులు ఆయనకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

  ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు  కృషి చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News