Namaste NRI

భోళాశంకర్ హంగామా..  మరో రెండు రోజుల్లో

చిరంజీవి  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్‌. మోహర్‌ రమేష్‌ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. హీరో సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. ఈ సినిమాలోని జామ్‌ జామ్‌ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క అంటూ సాగే రెండో గీతాన్ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ పాట తాలూకు ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఇందులో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి తనదైన శైలి హుషారైన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను ముస్తాబు చేస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది.

ఈ  చిత్రంలో  రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ నెలాఖరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్‌, సంభాషణలు: మామిడాల తిరుపతి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహర్‌ రమేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events