Namaste NRI

కన్నడ హిట్ మూవీ తెలుగులోకి

  రవికిరణ్‌, మాన్వితా హరీశ్‌ జంటగా నటించిన చిత్రం తారకాసుర.  హాలీవుడ్‌ నటుడు డేనీ సపనీ కీలకపాత్ర పోషించారు.  కన్నడలో సంచలన విజయం సాధించిన తారకాసుర చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. చంద్రశేఖర్‌ బండియప్ప దర్శకత్వం వహించారు. శ్రీజా మూవీస్‌ పతాకంపై విజయభాస్కర్‌ రెడ్డి పాళ్యం తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ తారకాసుర  చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేముందు కొన్ని మార్పులు చేస్తున్నాం. దానికోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. మా బ్యానర్‌లో ఓ స్ట్రెయిట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాం  అన్నారు.ఈ  సమావేశంలో విజయ్ భాస్కర్ రెడ్డి, శాంసన్ యోహాన్, తృప్తి శుక్లా, పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి, దర్శకులు నగేష్ నారదాసి, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ముఖ్య పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events