Namaste NRI

నాయకుడు యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథ : ఉదయనిధి స్టాలిన్‌

ఉదయనిధి స్టాలిన్ పొలిటికల్, యాక్షన్ డ్రామా మామన్నన్. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్  స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే తమిళనాట విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నాయకుడు పేరుతో విడుదల చేస్తున్నాయి.  ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ మీడియా తో  మాట్లాడుతూ తమిళంలో ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు అంతటా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. సామాజిక న్యాయం, సమానత్వం గురించి ఈ సినిమాలో చర్చించాం. ఇదొక పొలిటికల్‌ డ్రామా. సార్వజనీన అంశాలతో ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుంది. ఈ కథ వినగానే ఆసక్తి కలిగింది. ఇప్పటివరకు నేను కమర్షియల్‌ సినిమాలు మాత్రమే చేశాను.

కానీ ఈ కథలో సామాజిక పరివర్తన జరగాలనే గొప్ప సందేశం ఉంటుంది. ఈ సినిమాలో సీనియర్‌ కమెడియన్‌ వడివేలు నా తండ్రి పాత్రలో నటించారు. కథాపరంగా ఆ క్యారెక్టర్‌ చాలా కీలకంగా ఉంటుంది. తండ్రి పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు వడివేలు పేరును సూచించారు. అయితే ఆయన అంత సులభంగా అంగీకరించలేదు. నేనే ఫోన్‌ చేసి ఒప్పించాను. ఆయన ఇమేజ్‌కు భిన్నంగా వడివేలు సీరియస్‌ రోల్‌లో కనిపిస్తారు. కీర్తి సురేష్‌, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రతిభావంతులైన నటులు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఇదే నా చివరి చిత్రమనుకుంటున్నా  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events