Skip to main content

Namaste NRI

మరోసారి నోరు జారిన అమెరికా అధ్యక్షుడు బైడెన్!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా అంతర్జాతీయ వేదికపై మరోసారి నోరు జారారు. లుథియానాలో జరిగిన నాటో సదస్సు లో పాల్గొన్న బైడెన్ మైకు ముందు టంగ్ స్లిప్ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ పేరును పలకబోయి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ అని సంబోధించబోయారు. అయితే వెంటనే తన పొరపాటును గుర్తించిన అధ్యక్షుడు ఆ తర్వాత సరైన మాట పలికారు. అయితే, ఆ సమయంలో బైడెన్ పక్కనే జెలెన్ స్కీ కూడా ఉండటం గమనార్హం.

Social Share Spread Message

Latest News