Namaste NRI

కాబోయేవాడిని వెతికిపెట్టండి …రూ.4 లక్షలు ఇస్తా

ఆమె వ‌య‌సు 35 ఏండ్లు. ఒంట‌రిగానే ఉంటోంది. కొన్నాళ్లు డేటింగ్‌లో మునిగి తేలింది. కానీ ఆ జీవితం ఆమెకు న‌చ్చ‌లేదు. డేటింగ్‌కు స్వ‌స్తి ప‌లికి ఓ తోడు కావాల‌ని ఆమె కోరుకుంటోంది. అయితే త‌న‌కు ఓ పెళ్లి కుమారుడిని చూసి పెట్టిన వారికి భారీ న‌జ‌రానా ఇస్తాన‌ని వెల్ల‌డించింది. త‌నకు భ‌ర్త‌ను వెతికి పెట్టిన వారికి బ‌హుమ‌తిగా 5 వేల డాల‌ర్లు(రూ. 4,10,462) ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికాలోని  లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈవ్ టిల్లే కౌల్స‌న్(35) కార్పొరేట్ లిటిగేష‌న్ అటార్నీగా ప‌ని చేస్తుంది. కానీ ఒంట‌రిగా ఉంటూ ఐదేండ్ల పాటు డేటింగ్ చేసింది. అయితే ఆమెకు ఈ డేటింగ్ జీవితం మీద విర‌క్తి రావ‌డంతో.. త‌న‌కంటూ ఓ తోడు ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో త‌న‌కు ప‌ది ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు ఉన్న టిక్ టాక్ వేదిక‌గా కౌల్స‌న్ ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌కు భ‌ర్త‌ను వెతికి పెడితే 5 వేల డాల‌ర్లు బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. అయితే మీరు వెతికిపెట్టే భ‌ర్త‌తో ఎక్కువ కాలం ఉండ‌లేను. కేవ‌లం 20 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉండి, ఆ త‌ర్వాత విడాకులు ఇస్తాను. ఇక పెళ్లైన త‌ర్వాత రిజిస్ట్రేష‌న్ ద‌స్త్రంపై సంత‌కం చేసిన త‌ర్వాత త‌న‌కు పెళ్లి సంబంధం చూసిన వ్య‌క్తికి తాను చెప్పిన విధంగానే న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తాన‌ని కౌల్స‌న్ ప్ర‌క‌టించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events