నాని హీరోగా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా॥ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మృణాళ్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. దక్షిణాది భాషల్లో హాయ్ నాన్న, హిందీలో హాయ్ పాపా అనే టైటిల్‌ను పెట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో నాని భుజాలపై ఓ పాప కూర్చొని ఉండగా, వారిద్దరి వెనక కథానాయిక మృణాల్ ఠాకూర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఆద్యంతం హృద్యంగా సాగే చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. డిసెంబర్ 21న విడుదల చేస్తాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్.














