Skip to main content

Namaste NRI

ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం

ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆయన మార్సిల్లేలో కొత్త భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడు మేక్రాన్ దంపతులు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేక్రాన్ ప్రధాని మోడీని ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన  గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్  అవార్డుతో సత్కరించారు. ఎంతో వినమ్రంగా తాను అవార్డును అందుకొంటున్నానని, 140 కోట్లమంది భారతీయులకు లభించిన గౌరవం ఇదని మోడీ పేర్కొన్నారు.

ఇంతకు ముందు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, అప్పటి వేల్స్ యువరాజుగా ఉండిన కింగ్ చార్లెస్, జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఉన్నారు.

Social Share Spread Message

Latest News