Skip to main content

Namaste NRI

భారత జాగృతి సంస్థ ఇటలీ శాఖ ఏర్పాటు

ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటు పడుతున్న భారత జాగృతి సంస్థ ఇటలీ శాఖను ప్రకటించింది. ఇటలీ శాఖ అధ్యక్షుడిగా తానింకి కిశోర్‌ యాదవ్‌ ను సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమించారు.  ఈ సందర్భంగా  సంస్థ ప్రధాన కార్యదర్శి రంగు నవీన్‌ ఆచారి  మాట్లాడుతూ ఈ   నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. కొత్తగా నియమించబడ్డ ఇటలీ శాఖ అధ్యక్షుడు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News