Namaste NRI

భారత్‌-యూకే సంబంధాలపై.. బ్రిటన్‌ కీలక వ్యాఖ్యలు

కెనడాలో ఏర్పాటువాద హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఐదురోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ప్రతినిధి భారత్తో సంబంధాలపై స్పందించారు. కెనడా చేసిన ఆరోపణలతో ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చలపై ప్రభావం చూపబోదని సమాధానం ఇచ్చారు. కెనడా అధికారులతో బ్రిటన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. భారత్తోనూ వాణిజ్య చర్చలు గతంలోనే మాదిరిగానే కొనసాగుతుందన్నారు. ల్యాండ్మార్క్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా వేగంగా పని చేయడం కొనసాగించాలని ఇరుదేశాలు అంగీకరించాయన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events