Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ ప్ర‌ధాని యులియా స్విరిడెంకో రాజీనామా

ఉక్రెయిన్ ప్ర‌ధాని యులియా స్విరిడెంకో రాజీనామా చేశారు. ఉక్రెయిన్ మంత్రిమండ‌లిలో ఆ దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ భారీ మార్పులు చేశారు. దీంతో ఆమె త‌ప్పుకున్నారు. అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ త‌న‌కు కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ఆమె చెప్పారు. గ‌తంలో ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిగా స్విరిడెంకో చేశారు. అయితే 2025 జూలైలో ఆమెకు ప్ర‌ధాని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అమెరికా, ఉక్రెయిన్ మ‌ధ్య ఖ‌నిజ ఒప్పందంలో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆమెపై గ‌తంలో ఉక్రెయిన్ ప్ర‌భుత్వం ప్ర‌శంస‌లు కురిపించింది. సంక్లిష్ట స‌మ‌యంలో ఉక్రెయిన్‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు స్విరిడెంకో తెలిపారు. త‌న త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ గురించి జెలెన్‌స్కీతో చ‌ర్చించిన‌ట్లు ఆమె తెలిపారు.

త‌న రాజ‌కీయా వ్యూహాన్ని మార్చుతున్నాన‌ని, దీనిలో భాగంగా ప్ర‌ధాని రాజీనామా చేస్తున్న‌ట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో మార్షియ‌ల్ చ‌ట్టం ప్ర‌కారం జెలెన్‌స్కీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోలేదు. యుద్ధ స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌రు కాబ‌ట్టి, ఆయ‌న కేవ‌లం త‌న క్యాబినెట్‌లో మార్పులు చేశారు. ప‌రిపాల‌న‌లో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు.

Social Share Spread Message

Latest News