బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రౌద్ర రూపాయ నమః. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్నారు. మోహన సిద్ధిఖి, పాయల్‌రాజ్‌పుత్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. సుర సుర అసురసుర..హర హర అతి భయంకరా అంటూ సాగిన ఈ గీతాన్ని సురేష్ గంగుల రచించారు. జాన్‌భూషణ్ స్వరపరిచారు. చక్కటి సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటుందని, విజువల్స్ కూడా బాగుంటాయని దర్శకుడు తెలిపారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. నటుడు రఘు మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలన్నీ నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు విడుదలైన సుర సుర సాంగ్ పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు. రఘు, వెంకట్, మోహన సిద్దిఖి, పాయల్ రాజ్ పుత్, సీనియర్ నటుడు సూర్య, తాగుబోతు రమేష్, గబ్బర్ సింగ్ బ్యాచ్, రఘు, వెంకట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, పాటలు: సురేష్ గంగుల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పాలిక్. సంగీతం జాన్ భూషన్; స్టంట్స్ః రన్ రవి; ఎడిటర్ః రామకృష్ణ అర్రమ్; ఆర్ట్ః సురేష్ భీమగాని; లిరికల్ వీడియో: నిశాంత్ , పీఆర్వోః రమేష్ చందు.















