తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో భారత రాయబార కార్యాలయం నుంచి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు టీడీపీ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. మేము సైతం బాబు కోసం అంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు జైల్లో ఉండడం మాకు ఎంతో బాధ, ఆవేదన కలిగిస్తోందని, అందుకే చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్డెక్కామని వక్తలు పేర్కొన్నారు. టీడీపీ అధినేత వెంటనే విడుదల కావాలని, వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమం ఎన్నారై టీడీపీ నెథర్లాండ్స్ అధ్యక్షులు వివేక్ కరియావుల, ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ కోక నాయకత్వంలో ముఖ్య సభ్యులు మధుకర్ రెడ్డి బండార్ల, బాలు అల్లిడి, వినోద్ బుడ్డి, మహీధర్ ఉడత, సునీల్ వేములపల్లి, రవితేజ చెరుకూరి, రమేష్ నెల్లూరి, పవన్ కోర, నవీన్ ఆచంట, తారక్, రాజ్ ఇంటూరి, సంపత్ ఐనంపూడి, శివ భైరపనేని, షబ్బీర్ సాహెబ్, శుభాని షేక్, రామకృష్ణ ప్రసాద్ ముప్పా కృషితో విజయవంతమైంది.














