Namaste NRI

అమెరికన్ ఎంబసీ కీలక ప్రకటన…రికార్డు స్థాయిలో

భారత్‌లోని అమెరికన్ ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారతీయులకు 10 లక్షల వీసాలు జారీ చేసినట్లు యూఎస్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. ఈ ఏడాది మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలన్న మా లక్ష్యం నెరవేరింది. రాబోయే కాలంలో మరింత పురోగతి సాధిస్తాం. మరింత ఎక్కువ మంది భారతీయులు అమెరికాను సందర్శించే అవకాశం కల్పిస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి  మాట్లాడుతూ మిషన్ 1మిలియన్ లో భాగంగా 10లక్షల వీసాలు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్‌తో అమెరికాకు అత్యంత కీలకమైన బంధం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. గతేడాది 12 లక్షల మంది భారతీయులు యూఎస్‌ను సందర్శించారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events