Skip to main content

Namaste NRI

సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

తెలుగు సమైక్యతా కమిటీ (సింగపూర్‌) ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  తెలుగు కార్మిక సోదరులు భక్తి శ్రద్ధలతో 5 రోజుల పాటు విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సింగపూర్‌ తెలుగు సమైక్యతా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు దాదాపు 700 మంది వరకు తెలుగు వారు హాజరై స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారని తెలియజేశారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం జలాన్‌ పపాన్‌ రిక్రియేషన్‌ సెంటర్‌కు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. సింగపూర్‌లోని తెలుగు కుటుంబాలతో పాటుగా కార్మిక సోదరులు ఘనంగా వేడుకలు జరుపుకొని స్వామి వారి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.  కళాకారుల ఆట పాటలతో, కార్మిక సోదరుల డ్యాన్స్‌లతో కార్యక్రమం ఆనందోత్సాహల మధ్య సాగింది.

Social Share Spread Message

Latest News