Namaste NRI

అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు :  జొన్నలగడ్డ

నవీన్‌చంద్ర, స్వాతి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం మంత్‌ ఆఫ్‌ మధు. ఈ నెల 6న విడుదల కానున్న ఈ సినిమా  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌  హైదరాబాద్‌లో జరిగింది. ఎం.ఎం.కీరవాణి, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు.  సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ దర్శకుడు శ్రీకాంత్‌ నాగోతితో భానుమతి రామకృష్ణ  చేశాను. చాలామంచి పేరొచ్చింది. ఇంకా మంచిపేరు రావాల్సిన సినిమా అది. రానున్న మంత్‌ ఆఫ్‌ మధు కూడా యూనివర్సల్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్‌ ట్రైలర్‌ మంత్‌ ఆఫ్‌ మధు. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అని ట్రైలర్‌ చెప్పింది. సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని అనుకుంటున్నా అని అన్నారు.  కీరవాణి మాట్లాడుతూ టైలర్‌ చూసినప్పుడు ఫీల్‌గుడ్‌ మూవీ అనిపించింది. దర్శకుడి ప్రతిభ ట్రైలర్‌లోనే కనిపిస్తుంది. సంగీత దర్శకుడు అచ్చు పనితనం కూడా బావుంది. సినిమా మంచి హిట్‌ అవ్వాలి అని ఆకాంక్షించారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ఒక గౌరవం ఉంటుందని, ప్రేక్షకుడు ప్రతి పాత్రనీ గుర్తుపెట్టుకుంటాడని నటి స్వాతి చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events