నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్. శ్రీలీల కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. నితిన్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. క్యారెక్టర్ బేస్డ్ మూవీ ఇది. కిక్ తర్వాత ఆ రేంజ్లో తెరకెక్కిస్తున్నాం. చక్కటి వినోదంతో పాటు అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుంది. నితిన్ లుక్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. కథాపరంగా ఎన్నో సర్ప్రైజ్లు చూడొచ్చు. హారీస్ జైరాజ్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఇది వరకే విడులైన డేంజర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నితిన్ లుక్స్‌కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా నితిన్ తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారు. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 8న ఎక్స్ట్రా ఆర్టినరీ మేన్ సినిమాను భారీ ఎత్తున్న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.














