Skip to main content

Namaste NRI

అమెరికాలో ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 19 అడుగుల విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. అమెరికా రాజధానికి సమీపంలోని మేరీల్యాండ్‌ సబర్బ్‌ ప్రాంతంలో 13 ఎకరాల విస్తీర్ణంలో, వైట్‌హౌస్‌కు 22 మైళ్ల దూరంలోని అకోకిక్‌ టౌన్‌షిప్‌లో దీన్ని ఏర్పాటుచేశారు. ఈ స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శిల్పి రామ్‌ సుతార్‌ నిర్మించిన ఈ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం ను కూడా ఈయనే రూపొందించారు. భారత్‌ వెలుపల ఇంత పొడవైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇదే ప్రథమం.  ఈ కార్యక్రమంలో జై భీమ్‌ నినాదాలు మార్మోగాయి. భారీ వర్షం కురుస్తున్నా అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికిపైగా భారతీయ అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News