Skip to main content

Namaste NRI

టైగర్‌ నాగేశ్వరరావు అందరినీ అలరిస్తాడు

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు . ఈనెల 20న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ దర్శకుడు వంశీ కథ చెప్పగానే నాకు నచ్చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడదామా? అని ఎదురు చూశాను. టైగర్‌ నాగేశ్వర రావు లో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. తప్పకుండా అందరినీ అలరిస్తుందన్నారు. ఈ సినిమాలో ఫైట్లు, పాత్రలూ అన్నీ సహజంగా ఉంటాయి. హేమలతా లవణంగా రేణూ దేశాయ్‌ పర్‌ఫెక్ట్‌గా సెట్టయ్యారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ పాటలకు మంచి స్పందన వస్తోంది. థియేటర్లో ఆ సౌండ్‌ నాక్కూడా వినాలని ఉందన్నారు. వంశీ మాట్లాడుతూ  తెలుగు చిత్రసీమకు ఓ అత్యుత్తమ సినిమాని అందించాలన్న ప్రయత్నంతోనే ఈ సినిమా మొదలెట్టా. నేను అనుకొన్నట్టుగానే సినిమా బాగా వచ్చింది. రవితేజగారి నటన చూశాక స్ర్కీన్లు చిరిగిపోతాయన్నారు. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ   ఈ సినిమా తన జీవితంలో చాలా కీలకమైనది రేణూ దేశాయ్‌ తెలిపారు. ఈ సినీ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

Social Share Spread Message

Latest News