Skip to main content

Namaste NRI

నేనెక్కడున్నా మూవీ రిలీజ్‌‌‌‌కు రెడీ

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో మిథున్‌ చక్రవర్తి కుమారుడు మియో చక్రవర్తి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతూ నటిస్తున్న చిత్రం నేనెక్కడున్నా. సశా ఛెత్రి కథానాయిక.  మాధవ్‌ కోదాడ దర్శకుడు. మారుతి శ్యాంప్రసాద్‌ రెడ్డి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ జర్నలిజం, రాజకీయం నేపథ్య కథాంశమిది. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలుంటాయి. హీరో హీరోయిన్లు ఇద్దరూ జర్నలిస్ట్‌ పాత్రల్లో కనిపిస్తారు అన్నారు. నిర్మాత మారుతి శ్యాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ   ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యింది. పాటలు బాగా వచ్చాయి. ముఖ్యంగా పబ్‌లో తెరకెక్కించిన గీతం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు.  నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News