ప్రముఖ నటుడు శ్రీరామ్ నటిస్తున్న తాజా చిత్రం పిండం. కుశీ రవి హీరోయిన్. సాయికిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ను టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు ఆవిష్కరించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తే అందరూ పైకి చూస్తుండగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.














