Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ… వేలంలో రికార్డు

లండన్‌లో ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ  నిర్వహించిన వేలంలో మెకలాన్‌ కంపెనీ తయారు చేసిన 97 ఏళ్ల నాటి సింగిల్‌ మాల్ట్‌ విస్కీ రూ.22 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.  దీంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది.  2019లో ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ.15 కోట్లకు  అమ్ముడుపోయింది. ఈ నెల 18న జరిగిన వేలంలో విస్కీ బాటిల్‌ ధర రూ.12 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా రూ.22 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మెకలాన్‌ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి 60 ఏళ్లు నిలవ చేసింది. దానిని 1986లో 40 బాటిళ్లలో  నింపింది. కానీ ఈ కంపెనీ వీటన్నింటికి అమ్మకానికి ఉంచలేదు. కొన్నింటిని మెకలాన్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది.

Social Share Spread Message

Latest News