Skip to main content

Namaste NRI

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకున్న.. షెన్నిస్ పలాసియోస్

ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్ ద‌క్కించుకున్న‌ది. నికరాగ్వా దేశానికి చెందిన 23 ఏండ్ల‌ షెన్నిస్ పలాసియోస్ మిస్‌ యూనివర్స్‌ -2023 టైటిల్‌ను గెలుచుకున్న‌ది. ఇక గ‌త ఏడాది చాంపియ‌న్ మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 72వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు శాన్ సాల్వడార్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. ఇక థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలువ‌గా, అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచింది. 84 దేశాల నుంచి యువతులు ఇందులో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News