Skip to main content

Namaste NRI

ఫిలడెల్ఫియా తెలుగుదేశం ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శాంతిహోమం

అక్రమ కేసుల నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఫిలడెల్ఫియా ఎన్నారైలు శాంతి హోమం నిర్వహించారు. ఫిలడెల్ఫియాలోని మాల్వేర్న్ సాయిబాబా మందిరంలో వేద పండితులతో నిర్వహించిన శాంతి హోమంలో మూడు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. చంద్రబాబు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుజాతి పునర్వైభవానికి కృషి చేయాలని అభిలషించారు. ఫిలడెల్ఫియా తెలుగుదేశం ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Social Share Spread Message

Latest News