Skip to main content

Namaste NRI

ఈ నెల 29న దీక్షాదివస్‌ : మహేష్ బిగాల

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష (29 నవంబర్, 2009)  చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది. తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ వెంట నిలవడంతో, కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆదేశాల మేరకు ప్రపంచ దేశాలలో దీక్ష దివస్ ని జరపాలని బీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ అమరులకు అలాగే తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించాలని కోరారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

Social Share Spread Message

Latest News