అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం ఆపై పేరొందిన ఐటీ కంపెనీలో పొందిన వారికి హెచ్1-బీ వీసా జారీ చేస్తారు. అయితే, రోజురోజుకు విదేశీయులు, అత్యధికులు భారతీయ విద్యార్థుల తాకిడి పెరుగుతుండటంతో హెచ్-1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ ఫీజు పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్ ) నిర్ణయం తీసుకున్నది. హెచ్-1 బీ వీసాతోపాటు ఎల్1 వీసా, ఎఫ్-1 విద్యార్థుల వీసా ధరలు కూడా పెంచుతు న్నట్లు సంకేతాలిచ్చింది. వీసాల ప్రాసెసింగ్ ఫీజు పెంపు నిర్ణయం వచ్చే ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.














