Skip to main content

Namaste NRI

హెచ్1-బీ వీసాలపై…జో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం ఆపై పేరొందిన ఐటీ కంపెనీలో పొందిన వారికి హెచ్1-బీ వీసా జారీ చేస్తారు. అయితే, రోజురోజుకు విదేశీయులు, అత్యధికులు భారతీయ విద్యార్థుల తాకిడి పెరుగుతుండటంతో హెచ్-1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ ఫీజు పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్ ) నిర్ణయం తీసుకున్నది. హెచ్-1 బీ వీసాతోపాటు ఎల్1 వీసా, ఎఫ్-1 విద్యార్థుల వీసా ధరలు కూడా పెంచుతు న్నట్లు సంకేతాలిచ్చింది. వీసాల ప్రాసెసింగ్ ఫీజు పెంపు నిర్ణయం వచ్చే ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events