సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించిన చిత్రం రామ్ (ర్యాపిడ్ యాక్ష న్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, డైలా గ్స్ అందించారు. దీపికాం జలి వడ్లమాని నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ శైలేష్ కొలను ఆవిష్కరించారు. ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు, అధికారులది కాదు, రాజకీయ నాయకులది మాత్రమే అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్‌లో రాబోతుంది.
ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా వంటి స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆశ్రిత్ అయ్యంగార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.














