Skip to main content

Namaste NRI

డైరెక్టర్‌ శైలేష్‌ కొలను చేతుల మీదుగా రామ్‌ ట్రైలర్ రిలీజ్

సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా  నటించిన చిత్రం రామ్‌ (ర్యాపిడ్‌ యాక్ష న్‌ మిషన్‌). మిహిరామ్‌ వైనతేయ దర్శకుడు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, డైలా గ్స్‌ అందించారు. దీపికాం జలి వడ్లమాని నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ శైలేష్‌ కొలను ఆవిష్కరించారు. ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు, అధికారులది కాదు, రాజకీయ నాయకులది మాత్రమే అంటూ శుభలేఖ సుధాకర్‌ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. కమర్షియల్‌, యాక్షన్‌, పేట్రియాటిక్‌ జానర్‌లో రాబోతుంది.

ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా వంటి స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆశ్రిత్ అయ్యంగార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events