Skip to main content

Namaste NRI

తృటిలో తప్పించుకున్న నేతలు… జెలెన్‌స్కీ, గ్రీక్‌ ప్రధాని లక్ష్యంగా

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రీక్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సటాకోస్‌లిద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారి కాన్వాయ్‌ లక్ష్యంగా రష్యా ప్రయోగించిన క్షిపణి కేవలం 500 మీటర్ల దూరంలో పడింది.  నల్లసముద్రం తీరంలోని ఒడెస్సా నగరంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. గ్రీక్‌ ప్రధాని కిరియా కోస్‌ ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీతో కలిసి నగరం చూడటానికి బయల్దే రారు. ఈ సమయంలోనే క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

Social Share Spread Message

Latest News