ఇజ్రాయెల్‌లోని భారతీయుల భద్రత, రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామని విదేశీ వ్యవహాల శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రత, రక్షణ మాకు అత్యంత ప్రాధాన్యం అని పేర్కొంది. ఈ నెల 4న హెజ్బొల్లా మిలిటెంట్ల క్షిపణి దాడిలో ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కేరళకు చెందిన పాట్ నిబిన్ మాక్స్వెల్(30) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ ప్రారంభించింది. హెల్ప్‌లైన్ ఉంది. ఎవరికైనా సాయం కావాలంటే రాయబార కార్యాలయాన్ని సంప్రదించొచ్చు అని విదేశీ వ్యవహారాల మంత్రి త్వశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. మరోవైపు మాక్స్వెల్ మృతదేహం తిరువనంతపురం చేరుకుంది. అంత్యక్రియలు కొల్లాంలో జరగనున్నాయని మృతుడి బంధువులు తెలిపారు.














