దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి డొనాల్డ్ ట్రంప్‌తో పెను ప్రమాదం పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి బైడెన్ చేసిన తన చివరి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ట్రంప్‌పై విరచుకుపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు మోకరిల్లి పగ, ప్రతీకారాలకు మాజీ అధ్యక్షుడు మద్దతిస్తున్నారని ఆరోపించారు. 2020 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడిని ప్రస్తావించారు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని కలిగించే ప్రయత్నం చేసిన వారితో ఇంకా అమెరికాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఆ రోజున శాంతియుత అధికార బదిలీని, ఎన్నికల ఫలితాన్ని దొంగలించే ప్రయత్నం చేశారు. అమెరికా బలంగా నిలవడంతో విఫలమయ్యారు. అయితే వారి ముప్పు ఇంకా ఉంది బైడెన్ తెలిపారు.














