స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2024 మార్చ్ 3 అదివారం నాడు 5 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం గారు విచ్చేసి తెలుగు భాష మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనది అని వివరించారు అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ వీరు శ్రీమతి శేషుకుమారి గారి గానం , శ్రీమతి ప్రత్యూష గారి నాట్యాలను మేళ వించి మధుర మైన భావనతో ప్రేక్షకులను మైమరపింప చేశారు.
ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ శ్రీ జ్యోతీ శ్వర్ గారు, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి గారు, శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్ గారు, కమల క్లబ్ అధ్యక్షులు,సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు గారు, మగువ మనసు అడ్మిన్ ఉష గారు, సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, జయ, ప్రత్యూష , సింగపూర్ సుమన్ టీవీ అరుణ గారు ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం.

స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి యడవల్లి శేషుకుమారి గారు మరియు వారి శిష్యులు చిన్నారులు కీర్తనలను ఆలపించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు శ్రీమతి ప్రత్యూష గారి శిష్యులు నాట్యం ప్రదర్శించారు. పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రధానం చేశారు.

అతిథులకు శ్రీమతి యడవల్లి శేషుకుమారి గారు ఆచార్య వై. రెడ్డి శ్యామల గారు మూమెంటో లను బహుకరిం చారు, శ్రీ శివ కుమార్ గారు మృదంగం పై వాయిద్య సహకారం అందించారు , ఈ కార్యక్రమానికి శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి ఆచంట ప్రసన్న గారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.పలువురికీ లలిత కళా రంగం లో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 150 మంది హాజరు కావటమే కాకుండా.. సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.














