Skip to main content

Namaste NRI

అమెరికాలో పెరుగుతున్న హిందూ ఫోబియా

అగ్రరాజ్యం అమెరికాలో చాపకింద నీరులా హిందూ ఆధిపత్యం పెరిగిపోతోందని, ఫలితంగా ఇప్పటి వరకు అందరికీ అన్ని హక్కులు అనే విధానాన్ని అవలంబిస్తున్న దేశంలో హిందూత్వం పెరిగిపోతోందని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని పేర్కొన్నాయి.

కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్నాయి. అత్యధికంగా యూదులపై ఈ దాడులు జరుగుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో హిందువులు, ముస్లింలు ఉన్నారు. కాలిఫోర్నియా పౌర హక్కుల శాఖ ఈ వివరాలను వెల్లడించింది. విద్వేష దాడుల్లో 36.9% యూదులపై జరుగగా, హిందువులపై 23.3%, ముస్లింలపై 14.6% దాడులు జరిగాయి.

Social Share Spread Message

Latest News